Sunday, September 2, 2012

తెలుగురధం త్వరలో అంతర్జాల పత్రిక  రూపములో రాబోతోంది .  తగు సూచనలను, సలహాలను అందించగలరని కోరుచున్నాము . కొంపెల్ల శర్మ .

Tuesday, December 21, 2010

teluguratham patrika: తెలుగురధం సంస్థ - జయదేవ కవి ఆరాధనోత్సవం

teluguratham patrika: తెలుగురధం సంస్థ - జయదేవ కవి ఆరాధనోత్సవం: "మా సంస్థ - తెలుగురధం - సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ - తదుపరి కార్యక్రమాన్ని తలపెట్టింది. జయదేవ కవ..."

తెలుగురధం సంస్థ - జయదేవ కవి ఆరాధనోత్సవం

మా సంస్థ -  తెలుగురధం - సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ - తదుపరి కార్యక్రమాన్ని తలపెట్టింది. 
జయదేవ కవి ఆరాధనోత్సవం (మార్గశిర కృష్ణ ఏకాదశి) సందర్భంగా శ్రీ గీత గోవిందం లోని అష్టపదుల కృతుల్ని "స్వర రాగ గీత నీరాజనం" అనే అంశంగా శ్రీమతి ఎర్రమిల్లి రమాప్రభ గారిచే సంగీత కార్యక్రమం జరుగుతుంది. 
చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలోని కళా వెంకట సుబ్బారావు కళావేదిక లో 27 డిసంబర్ సోమవారం  సా. 6 గంటలకు  జరుగును. సాహిత్య, సంగీత సాంస్కృతిక అభిమానులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తున్నాము.
భారత దేశానికంతకూ సంగీత సాహిత్యాత్మకమైన తొలి ప్రబంధం, భక్తి రూపాన్నమైన మధురోజ్జ్వల రసరాట్టు, వసంత కుసుమాకర పూర్ణచంద్రోదయ మేళవింపుల రంగరింపుల రసగుళిక శ్రీ గీత గోవిందం గా భావించబడుతోంది. శృంగార వివేక తత్త్వ రచన, అమలిన ప్రేమ కథ, ప్రేమోల్లాస విలాసం, కళాసౌందర్య సాక్షాత్కారం, మధుర భక్తి రూపకం, సంస్కృత సాహిత్య సరస్వతికి అమూల్యాలంకార రమణీయకృతి గా విరాజిల్లుతున్న ప్రనంద సృష్టికర్త జయదేవ కవికి స్వరరాగ నీరాజనం సమర్పించే ప్రయత్నంలో అందరి సహాయ సహకారాలను అందించవలసినదిగా కోరుకుంటున్నాము.
మిగతా వివరాలకు - కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురధం. 97017 31333

Thursday, December 9, 2010

తెలుగు రథం (సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ)


తెలుగు రథం బ్లాగ్ ని మా సంస్థ - తెలుగు రథం (సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ) కార్యక్రమాలతో అనుసంథానం చేసుకుంటూ  బ్లాగుని ఒక సమగ్ర సమాచార వేదికగా రూపొందే ప్రయత్నాలు చేస్తున్నాము.
ప్రత్యేకమైన వెబ్ సైట్  కూడా తయారు అవుతోంది.
మీ అందరి సహాయ సహకారాలతో, మీ ముందు ప్రత్యక్షం అవుతాం.
ఇట్లు - కొంపెల్ల శర్మ
వినతి

Saturday, October 9, 2010

తెలుగురధం పత్రిక శుభారంభం

తెలుగురథం పత్రికను ప్రారంభిస్తున్న శుభతరుణంలో పత్రికను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు తగు ఆలోచనలను, సలహాలను అందించవలసినదని ఈ సందర్భంగా కొరుచున్నాము.

కొంపెల్ల శర్మ
97017 31333